Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో చర్మాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పగిలిన చర్మంపై ఎటువంటి మేకప్ అయినా ముఖంపై సరిగ్గా అమరదు. అందుకే ముఖంపై క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ పూస్తుంటే చర్మం పగుళ్లు లేకుండా అందంగా ఉంటుంది.
- మేకప్‌కు ముందు ముఖాన్ని మృదువైన లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- ఆరాక చర్మపు రంగుకి, తత్త్వానికీ నప్పే షేడ్‌ను వేసుకోవాలి. పదినిమిషాలు పాటు పూర్తిగా ఆరిన తరువాత మేకప్‌ను మొదలుపెట్టాలి.
- శీతాకాలంలో కనురెప్పలపై స్మోకీ లుక్ చాలా బాగుంటుంది. కనురెప్పలపైన స్మోకీ లుక్ కోసం ముదురురంగులో పెన్సిల్ లైనింగ్ వేసుకోవాలి.
- ముందుగా పెదాలపై ముదురు వర్ణంలో ఉన్న లిప్‌స్టిక్‌ను బేస్‌గా వేసుకోవాలి. దానిపై మీరు ఏ రంగు వేసుకోవాలనుకున్నారో ఆ రంగును వాడాలి. అప్పుడే పెదాలు అందంగా, తీర్చిదిద్దినట్లుంటాయి. అదీకాక లిప్‌స్టిక్ చాలాసేపటివరకు తాజాగా ఉంటుంది.
- ఈ కాలంలో ముఖానికి బేస్‌గా న్యూట్రల్ షేడ్స్‌ను మాత్రమే వాడాలి. ముదురు వర్ణాలు వాడినట్లైతే ముఖం పొడిబారినట్లుగా కనిపిస్తుంది. ఈ వాతావరణంలో వీలైనంత ఆయిలీగా ఉంటేనే ముఖం మెరుస్తున్నట్లుంది.