Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టిఫిన్ బాక్సులు, బ్యాగులు, పెన్నులు, పర్సులు వస్తువేదైతేనేం.. అయ్యో మరిచిపోయా అని అనుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందట. ప్రయాణ సమయంలో హడావుడి, సమయానికి ఆఫీసుకు చేరుకోవాలన్న తొందరలో చాలా మంది ఇంట్లోనే తమ వస్తువులను మరచిపోతున్నారట. దీనికంతటికి కారణం ఒత్తిడేనని చెబుతున్నాయి పరిశోధనలు. ఒత్తిడి వల్ల మతిమరుపు మాత్రమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అజీర్ణ సమస్య
ఒత్తిడి వల్ల ఎదురయ్యే సమస్యల్లో అజీర్తి కూడా ఒకటి. జీర్ణవ్యవస్థ పనితీరుపై ఒత్తిడి బాగా ప్రభావం చూసిస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో విడుదల అవుతాయి. జీర్ణకోశంలోకి చేరిన ఆహారాన్ని ఈ ఆమ్లాలు జీర్ణం కానీయకుండా చేసి అసౌకర్యానికి గురిచేస్తాయి. వీటివల్ల కొన్ని సందర్భాల్లో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఒత్తిడి వల్ల ఆకలి, ఊబకాయం ఒత్తిడికి కారణమయ్యే ఎంజైమ్ పేరు అల్ఫా అమలైజ్. ఈ ఎంజైమ్ వల్ల చాలామంది మహిళలు గర్భం ధరించలేకపోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే శరీరంలో ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఆకలి కూడా పెరుగుతుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుని బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా ఊబకాయం సమస్య కూడా ఎదురుకావచ్చు. అలాగే మరికొందరిలో ఆకలి మందగించి బరువును కూడా కోల్పోవచ్చు.
నెలసరి సమస్యలు
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి అలవాట్ల కారణంగా శరీరంలో హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితంగా స్త్రీలలో ఋతుక్రమం ముందూ వెనుకా ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఇలాంటి సమస్యల వల్ల క్రమంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యవల్ల చాలామంది మహిళలు మనోవేధనకు గురవుతున్నారు. అంతేకాదు ఈ సమస్య మరీ ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నాయి కొన్ని అధ్యయనాలు.?
నిద్ర పట్టకపోవడం
ఒత్తిడితో బాధపడు తున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఒత్తిడిని మరింత పెంచుకోవడానికే చూస్తుంటారు. దీనివల్ల సరిపడా నిద్రలేక రోజంతా నీరసంగా, డల్‌గా అనిపిస్తుంటుంది. తద్వారా ఏపనీ శ్రద్దగా చేయలేం. కాబట్టి ఇలాంటి సమస్యలు దరిచేరకూడదంటే ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది.ు