Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోలెడు పనులు లేదా విశ్రాంతితోనే సమయం గడిచిపోతుంది. కానీ ప్రణాళిక ఉంటే గనక సెలవు రోజు కూడా మనకు నచ్చినట్టుగా ఆనందించొచ్చు. అదెలాగో తెలుసుకోండి మరి..
- ముందు రోజు రాత్రి అంటే శనివారం నుంచి మొదలుపెడదాం. మర్నాడు సెలవు కాబట్టి అన్నీ నిదానంగా చేసుకోవచ్చులే అని అనుకోకూడదు. వారంలోని ఇతర రోజుల్లాగే శనివారం కూడా మరుసటి రోజు పనులు పూర్తిచేసుకోవాలి. అప్పుడే పొద్దుటి పూట కాస్త సమయం మిగులుతుంది.
- సెలవురోజు కాబట్టి కాస్త ఆలస్యంగా నిద్రలేస్తాం. కానీ మిగిలిన రోజుల్లానే పొద్దున్నే నిద్రలేవడం మంచిది. వంటపనీ అన్నీ పూర్తి చేసుకుంటే సమయం మిగులుతుంది.
- సెలవురోజున కుటుంబ సభ్యులంతా కలసి భోజనం చేయడం.. వీలైనంత ఎక్కువసేపు గడపడం... వంటివి ఓ నియమంగా పెట్టుకోవాలి. కేవలం ఈ ఒక్క రోజు సెల్ఫోను, కంప్యూటరు, ట్యాబ్ లాంటివాటిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.
- ఓ గంట సమయం పెట్టుకుని రాబోయే వారానికి చేయబోయే పనుల్ని ఓ చోట రాసి పెట్టుకోవడం తప్పనిసరి. కుదిరితే దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీలను సిద్ధంగా పెట్టుకుంటే మిగిలిన రోజుల్లో ఒత్తిడి లేకుండా ఉంటుంది. చివరి నిమిషంలో వెతుక్కునే పరిస్థితి ఎదురుకాదు.
- టీవీ చూస్తూ గడిపేయాలనుకుంటారు చాలామంది. కానీ కుదిరితే స్నేహితులతో, దగ్గరి బంధువులతో ఓ ఐదు, పదినిమిషాలు మాట్లాడటం వల్ల సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు అనే నిష్ఠూరాలు ఉండదు. కాబట్టి దానికి కూడా కొంత సమయం పెట్టుకునేలా చూసుకోవాలి. ల