Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫేషియల్ మసాజ్.. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు ఇదొక చక్కని మార్గం. ఈ పురాతన పద్దతి ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. మసాజ్ మీ చర్మానికి ప్రశాంతతను అందించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.
- చర్మానికి రక్తప్రసరణని మెరుగుపరచడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సరైన రక్తప్రసరణ వలన చర్మకణాలకి తగినంత పోషణ లభించి అవి ఉత్తేజంగా మారతాయి. తద్వారా, యవ్వనం ఉట్టిపడే చర్మం మీ సొంతమవుతుంది.
- ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ వంటివి కనిపించవు. ఫైన్ లైన్స్‌ని తగ్గించి ముడతలని అరికడుతుంది. కళ్లచుట్టూ అలాగే నోటి చుట్టూ చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ కనిపించవు.
- చర్మంలోని కొలాజెన్ శాతం తగ్గిపోతే చర్మం అనేక సమస్యలతో సతమతమవుతుంది. అయితే, క్రమపద్దతిలో ఫేషియల్ మసాజ్ ను అందించడం వలన కొలాజెన్ నష్టాన్ని నివారించవచ్చు. తద్వారా, చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
- చర్మంలోని ఎలాస్టిసిటీని ఫేషియల్ మసాజ్ మెరుగుపరుస్తుంది. ఈ సహజసిద్ధమైన పద్దతి వలన చర్మంలోని ఎలాస్టిసిటీ పుంజుకుంటుంది. తద్వారా, చర్మం బిగుతుగా అలాగే యవ్వనంగా కనిపిస్తుంది.
- కళ్లకింద బ్యాగ్స్‌తో పాటు నల్లటి వలయాలు చర్మంలోని వాటర్ రిటెన్షన్ వలన ఏర్పడతాయి. వాటర్ రిటెన్షన్‌ని అరికట్టే అద్భుతమైన ప్రక్రియ మసాజ్. సరైన ఫేషియల్ మసాజ్ ద్వారా కంటి కింద ఫ్లూయిడ్ రిటెన్షన్‌ని అరికట్టి కళ్లకింద బ్యాగ్స్‌ని, నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.
- ప్రతిరోజూ చర్మరంధ్రాలలో ఎంతో కొంత టాక్సిన్స్ పేరుకుపోతాయి. చర్మం కాలుష్యానికి గురికావటంతో ఇలా జరుగుతుంది. దీంతో మొటిమల సమస్య వేధిస్తుంది. అందువలన, చర్మాన్ని తరచూ డిటాక్సిఫై చేసుకోవడం ఎంతో ముఖ్యం. చర్మాన్ని మసాజ్ చేయడం ద్వారా చర్మాన్ని శుభ్రపరచుకోవచ్చు. చర్మరంధ్రాలలో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని, టాక్సిన్స్ ని తొలగించుకుని మొటిమల సమస్యను నివారించవచ్చు.
- ఫేసియల్ మసాజ్ వలన చర్మంలోని కాంతి ఉట్టిపడుతుంది. అందువలన చర్మం నిస్తేజంగా మారినప్పుడు ఈ టెక్నిక్ చర్మాన్ని లోపల నుంచి ఉత్తేజ పరిచి కాంతివంతం చేస్తుంది.