Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి చర్మం ఎప్పుడూ జిడ్డుకారుతూ ఉంటుంది. దీంతో ఫంక్షన్లు, వేడుకల సమయంలో ఎంత బాగా రెడీ అయినా ముఖం తొందరగా పాడయిపోతుంటుంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించి చూడండి.
ఐస్ క్యూబ్స్: ఐస్‌కు చర్మాన్ని బిగుతుగా ఉంచే గుణం ఉంది. అంతేకాదు పెద్దవైన చర్మ రంధ్రాలను చిన్నవిగా చేస్తుంది . ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది . మీరు చేయాల్సిందల్లా మొదట ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలను పలచటి గుడ్డలో చుట్టి సాగిన చర్మ రంధ్రాల దగ్గర కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీది చర్మం బిగుతుగా తయారవుతుంది.
ఓట్మీల్: పాడైన చర్మాన్ని తొలగించడంలో ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంలో ఉండే అదనపు జిడ్డుతనం పోవడంతోపాటు చర్మం మదువుగా తయారవుతుంది. స్కిన్ సెన్సిటివ్‌గా ఉండడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఓట్‌మీల్‌కు తెల్లసొనను జోడించి ఆ మిశ్రమాన్ని పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును చర్మ రంధ్రాలు తెరుచున్నచోట అప్లై చేయాలి. ముఖానికి రాసుకున్న పేస్టు ఎండిపోయిన తర్వాత కొద్దిగా నీరు పోసి మెల్లగా చర్మం పైభాగాన కాసేపు మదువుగా రుద్దాలి. తర్వాత నీటితో ముఖాన్ని బాగా కడుక్కోవాలి.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ బాగా ఉంటుంది. ఇది ఎల్లవేళలా చర్మ సమతుల్య స్థితిని కాపాడుతుంది. మత కణాలను తొలగిస్తుంది. చర్మం రంధ్రాలపై కూడా బాగా పనిచేస్తుంది. స్కిన్‌ని ఎంతో మదువుగా ఉంచుతుంది. పెరుగులో బాగా మెత్తగా రుబ్బిన బాదంపప్పులను, ఎండిన కమలాపండు తొక్కల పొడిని, నిమ్మకాయతొక్కల పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసి ముఖంపై రాసి చేతి వేళ్లను చర్మంపై భాగాన అటు ఇటు గుండ్రంగా తిప్పుతూ మదువుగా మర్దనా చేయాలి. తర్వాత నీటితో ముఖాన్ని బాగా కడిగేసుకోవాలి.
తెల్లసొన: తెల్లసొనలో ఎంజైములు బాగా ఉంటాయి. చర్మంలోని నూనె కారే గుణాన్ని అవి బాగా తగ్గిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడంతోపాటు, టోనింగ్ చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నిరోధిస్తాయి. దీనికి మనం చేయాల్సిందలా తెల్లసొనను బాగా గిలకొట్టి పెదాలకి తప్ప ముఖానికంతటికీ రాసుకోవాలి. అది బాగా ఎండిపోయిన తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
ముల్తాని మట్టి: చర్మంలో ఉన్న అదనపు ఆయిల్‌ని పూర్తిగా పీల్చేసే గుణం ముల్తాని మటికి ఉంది. అంతేకాదు చర్మం సూక్ష్మరంధ్రాలు సాగకుండా చేస్తుంది. ముఖంపై చర్మాన్ని బాగా కీ ్లన్ చేస్తుంది. నల్లమచ్చలను, గీతలను కూడా పోగొడుతుంది. సూర్యకిరణాలు సోకడం వల్ల దెబ్బతిన్న చర్మాన్ని సైతం ఇది పరిరక్షిస్తుంది. దీన్ని అప్లై చేయడం చాలా సింపుల్. ముల్తానీమట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారుచేసి దాన్ని కళ ్ల చుట్టూరా, పెదాల దగ్గర తప్ప మిగతా ముఖానికి రాసుకొని అది ఎండిపోయే వరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
టొమాటో జ్యూస్: ముఖం మీదున్న జిడ్డుతనాన్ని పోగొట్టడంలో టొమాటో జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని సూక్ష్మరంధ్రాలను శుభ్రంచేయడమే కాకుండా అవి ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే టొమాటో జ్యూసు లేదా టొమాటో గుజ్జును ముఖం మీద రాసుకోవాలి. టొమాటోకు కీర, తెల్లసొనలను కూడా చేర్చి ఆ మిశ్రమాన్ని సైతం ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం బాగా శుభ్రమవుతుంది.