Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్డుపై వెళ్ళే యువతులను ఢ కొట్టి వెళ్తుంటారు కొద్దిమంది. పోనిలే అని చాలామంది అమ్మాయిలు పట్టించుకోరు. ఇదే అలుసుగా తీసుకుని అమ్మాయిలను ఢ కొట్టి ఇబ్బంది పెడతారు. ఎక్కువగా రద్దీగా ఉండే బస్స్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో అకతాయి అబ్బాయిలకు ఎలా బుద్ధి చెప్పాలో చూద్దాం.
స్టెప్ 1
ఎదురుగా వచ్చి ఢ కొట్టినప్పుడు ఆ అమ్మాయి వెంటనే అలర్ట్ అయ్యింది. వెంటనే తన ఎడమచేతితో అతని చేతిని , కుడి చేతితో అతని జుట్టును పట్టుకుని వెనక్కి లాగింది.
స్టెప్ 2
ఆ తర్వాత అతని గొంతు దగ్గర తన ఎల్బోతో బలంగా పంచ్ చేసింది.
స్టెప్ 3
ఎల్బోతో కొట్టడం వల్ల అతని బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతాడు. వెంటనే అతని కడుపులో బలంగా పంచ్ చేయాలి.