Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండక్షన్ స్టవ్‌పై వంట చేస్తున్నప్పుడు మెటల్ ప్యానల్ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్ పైనుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్ఛాప్ చేయడం మరచిపోకండి. ఇండక్షన్ స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు ఉంచడం ప్రమాదకరం.
వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవపదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఇండక్షన్ స్టవ్‌లను క్లీన్ చేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి పొడి బట్టతో శుభ్రం చేయాలి. నీటితో గానీ తడి బట్టతో వీటిని క్లీన్ చేయకూడదు.
ఇండక్షన్ స్టవ్‌లకు మన్నికైన స్విచ్‌బోర్డు ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూడాలి. ఎక్స్టెన్షన్ బాక్స్‌లను వాడటం వల్ల విద్యుత్ ప్రమాదాలు సంభవించవచ్చు.
వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాప్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్‌ను తొల గించడం కూడా తప్పనిసరని గ్రహించండి.