Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఇంట్లో సిడీల వాడకం పెరిగింది. చాలా వరకు పనికిరాని సిడీలను చెత్తలో పడేస్తుంటారు. కానీ, నేను మాత్రం పాడైన సిడీలతో నాకు తోచిన విధంగా అందమైన అలంకరణ వస్తువులను తయారు చేశాను. అంతేకాదు ఈ సంవత్సరం వరలక్ష్మీవ్రతం, వినాయకవ్రతం సందర్భంగా వీటిని మా ఇంట్లో ప్రత్యేకంగా అలంకరిస్తాను. వీటిని చేయడానికి నేను వాడిన వస్తువులు. పాడైన సిడీలు, చమ్మీలు, ఫెవికల్. ముందుగా అమ్మవారి రూపాన్ని చేయడం ఎలాగో చూద్దాం. నాలుగు సిడీలు అవసరం అవుతాయి. ఒక పూర్తి సిడీని ముఖంగా అలంకరించుకోవాలి. రెండు సిడీలను శంఖాకారంలో కట్ చేసుకుని, అమ్మవారి ముఖానికి ఇరువైపులా అమరేలా ఫెవికల్తో అతికించుకోవాలి. మరో సిడీని అంగళం వెడల్పుతో గుండ్రంగా కట్ చేసుకుని, అమ్మవారికి హారంగా, కిరీటంగా అమర్చుతూ ఫెవికల్తో అతికించాలి. ఇప్పుడు రంగులు, చమ్మీలు ఉపయోగించి.. అలంకరణ చేసుకోవాలి. ఇదంతా పూర్తి కావడానికి గంట సమయం పడుతుంది. ఇంట్లో గోడపై అమర్చితే ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదే విధంగా వినాయకుని బొమ్మ కూడా తయారు చేసుకోవచ్చు. దేవతామూర్తులే కాకుండా సిడీ మొత్తం ఒకే రంగు వేసి, దానిపై పూలు, లతలు, మీకు ఇష్టమైన బొమ్మలు వేసి గోడలపై అమర్చితే.. ఇంటికే కొత్త అందం వస్తుంది.
- ఎస్. శ్రీలత,
బీరంగూడ.