Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందంపై పెరిగిన ఆసక్తి కారణంగా.. అనేక రకాల కాస్మెటిక్స్ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే అందం కోసం ఉపయోగించే వీటి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో స్పష్టమైంది. మహిళల ఆరోగ్యాన్ని హరించి వేయడంలో కాస్మెటిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాస్మెటిక్స్‌లో ఉపయోగించే రసాయనాలు ఎలర్జీలతో పాటు చర్మ క్యాన్సర్, గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి. లిప్‌స్టిక్‌లో ఉపయోగించే లిడ్, కాండిమమ్, పెరాట్, మెథక్రిటేట్ వంటి రసాయాలతో పాటు ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఉపయోగించే ట్రెక్లోజన్ కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫెయిర్ నెస్ క్రీముల్లో మెర్కురీ కారణంగా దీర్ఘకాలంలో మూత్రపిండ సంబంధమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్మెటిక్స్ దీర్ఘకాలంగా ఉపయోగించే వారిలో కండరాల శక్తి తగ్గిపోతుందని, అధిక బరువు, అవాంఛిత రోమాలు, నెలసరి సమస్యలు వస్తాయి.
సో.. మార్కెట్లో లభించే కాస్మెటిక్స్ కన్నా వంటిట్లో ఉండే పసుపు, పాలు, మీగడ, పెరుగు, శెనగ పిండి మొదలనవి ఉపయోగిస్తే.. అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం.ు