Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన ప్రకృతిని చూడాలంటే కళ్లు మరింత ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన కళ్లకోసం పోషకాహారం మాత్రమే కాదు... కొన్ని వ్యాయామాలు కూడా అవసరం. తరచూ ఈ వ్యాయామాలు చేయడం వల్ల కళ్లు ఆరోగ్యంగానే కాదూ.. అందంగానూ కనిపిస్తాయి. ఆ వ్యాయామాల్లో కొన్ని మీకోసం..
రెండు అరిచేతుల్నీ రుద్ది.. వెచ్చగాచేసి రెండు నిమిషాలు కళ్లపైన ఉంచాలి. అయితే కళ్లపై ఒత్తిడి పడేలా గట్టిగా కాకుండా అరిచేతుల్ని కళ్లకు ఆనిస్తే చాలు. ఇలా ఆరేడుసార్లు చేయాలి.
నాలుగు సెకన్లపాటు కళ్లను గట్టిగా మూయడం, తెరవడం ఇలా ఏడునుంచి ఎనిమిది సార్లు చేయాలి.
కళ్లను మూసి ఉంచి చేతివేళ్లతో మసాజ్ చేస్తున్నట్లు రెప్పలపై నెమ్మదిగా గుండ్రంగా కదపాలి.
అలాగే కనుగుడ్లను సవ్యదిశలో ఒకసారి, అపసవ్యదిశలో ఒకసారి గుండ్రంగా తిప్పాలి. ఇలా అయిదుసార్లు చేయాలి. మధ్యమధ్యలో కనురెప్పలను మూస్తూ తెరుస్తూ ఉండాలి.
తలను విశ్రాంతిగా ఉంచి చూపును సవ్యదిశ లోను, అపసవ్య దిశ లోనూ తిప్పాలి. ఇలా మూడు ార్లు చేయాలి.
దూరంలోని ఒక వస్తువును తదేకంగా చూడాలి. మళ్లీ 30 అడుగులలోపు ఉన్న వస్తువుపైకి దృష్టి మరల్చాలి. ఇలా పదిసార్లు చేయాలి.
వీలు చిక్కినప్పుడల్లా చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి.
తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి.
కనుగుడ్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్కనుంచి ఈ పక్కకు తిప్పాలి.
తలను ఏమాత్రం కదల్చకుండా కళ్లను వీలైనంత పైకెత్తి చూడాలి. మళ్ళీ వీలైనంత కిందకూ చూడాలి
తలను నిటారుగా వుంచి చూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు చూడాలి. అలాగే చూపును కిందకి దించి పూర్తిగా ఎడమవైపు చూడాలి. ు