Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్రెషన్ అనేది కేవలం మనసుకూ, మెదడుకూ సంబంధించింది మాత్రమే కాదు అది శరీరానికి కూడా సంబంధించింది' అని అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే, సాధారణ జనావళితో పోలిస్తే, ఎముకల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ) దెబ్బతినే ఆస్టియోపొరోసిస్ సమస్య డిప్రెషన్ బాధితుల్లోనే ఎక్కువ. ఎముకలు దెబ్బ తినడం అనేది స్ట్రెస్ హార్మోన్ల తీవ్రత ఉన్న వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో కనిపిస్తుంది. అలాగే, ఈస్ట్రోజన్ నిల్వలు, గ్రోత్ హార్మోన్ నిల్వలు తగ్గడానికీ, డిప్రెషన్ కూ సంబంధం ఉన్నట్లు కూడా పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. డిప్రెషన్ వల్లే ఆస్టియోపొరోసిస్ వస్తుందని కాదు గానీ, ఆస్టియోపొరోసిస్ రావడానికి గల కారణాల్లో డిప్రెషన్ కూడా ఉందనేది మాత్రం వాస్తవం.
అందువల్ల డిప్రెషన్‌తో ఉన్న మహిళలు తమ ఎముకల దారుఢ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం చాలా అవ సరం. అదే సమయంలో కొన్ని నివారణా చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగా రోజూ కాల్షియం మాత్రలు వేసుకోవడం, వాకింగ్, ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం తప్పనిసరి. ప్రసవానంతరం లేదా మెనో పాజ్ తరువాత ఆస్టియోపొరోసిస్ సమస్య ఎదురైతే వెంటనే, డాక్టర్‌ను సంప్రతించి బోన్- డెన్సిటీ టె స్ట్ చేయించుకోవడం మరువద్దు.