Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం చాలా మందికి అలవాటు. ఒకవేళ ముఖం ఉబ్బరించి ఉంటే తెగ ఆందోళన పడతారు. అయితే ముఖంలో తగ్గిన తేజస్సుని కింద పేర్కొన్న ఈ సహజ విధానాల ద్వారా సులభంగా నివారించవచ్చు.
- నీళ్లు ఎక్కువ తాగితే ముఖం ఉబ్బరిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల, డీ-హైడ్రేషన్ కారణంగా ముఖంవాస్తుంది. అంతేకాదు డీహైడ్రేషన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోయినా కూడా ముఖం ఉబ్బరిస్తుంది.
- శరీరంలో అధికశాతం ఉప్పు చేరడం వల్ల కూడా ముఖం ఉబ్బరిస్తుంది. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుదల చేస్తుంది. అందువల్ల కూడా ముఖం వాస్తుంది. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగొద్దు. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో సోడియం ఎంత ఉందో గమనించాలి. 50 సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్లు రోజుకు 2300 మిల్లీ గ్రాముల సోడియం మాత్రమే వాడాలి. 50 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న పెద్దవాళ్లు రోజుకు 1500 మిల్లీ గ్రాముల సోడియం మాత్రమే వాడాలి.
- ముఖం ఉబ్బరించకుండా ఉండాలంటే డైట్లో ఎక్కువ పీచుపదార్థాలు ఉండేలా జాగ్రత్తపడాలి. బొప్పాయి పండు తినడం వల్ల స్టమక్, చిన్నప్రేవులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. అంతేకాదు ముఖం కూడా ఎలాంటి ఉబ్బరింపు లేకుండా తేటగా, పలచగా ఉంటుంది. అలాగే విటమిన్-సి, బీటాకెరోటిన్, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లను బాగా తినాలి. ఇవి చర్మంలో నీరు నిలిచిపోకుండా సహాయపడతాయి. అంతేకాదు చర్మం కూడా మెరుపును సంతరించుకుంటుంది.