Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూస్ పేపర్‌ను పడేస్తున్నారా? లేదా అమ్మేస్తున్నారా. ఇకపై ఇంటి అవసరాలకు ఉప యోగించండి. ఈ చిన్న చిట్కాను ఉపయో గించి పాత న్యూస్ పేపర్‌ను మన ఇంటి అవసరాలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.
వంటింట్లో, అల్మారాల్లో నేరుగా వస్తువులు పెట్టడం వల్ల సెల్ఫులు పాడైపోతుంటాయి. న్యూస్ పేపర్‌పై కాస్తంత టాల్కం పౌడర్ చల్లి సెల్ఫుల్లో పర్చడం వల్ల వస్తువులు, బట్టలు పాడవకుండా ఉంటాయి.
షూలు పాడవకుండా షూ మధ్యలో న్యూస్ పేపర్లను పెట్టొచ్చు. షూ తడిగా ఉంటే లోపలి భాగంలో తేమను పీల్చుకునేందుకు కూడా వాడొచ్చు. మాంసపు గ్రిల్స్‌ను శుభ్రపర్చడానికి కూడా న్యూస్ పేపర్లు ఉపయోగపడుతాయి.
న్యూస్ పేపర్లలో వాడే రంగులను పూర్తిగా రసాయనాలతో తయారు చేస్తారు. ఈ కారణంగా న్యూస్ పేపర్లలో ఆహారపదార్థాలు తినకపోవడమే మంచిది. పూర్తి తెల్లటి కాగితాలను ఉపయోగించి ఆహారపదార్థాలను తినడంలో ఉపయోగించుకోవచ్చు.
కూరగాయల్ని తాజాగా ఉంచడానికి కూడా న్యూస్ పేపర్లు ఉపయోగపడతాయి. కిరాణా దుకాణాల్లో పొట్లాలు కట్టడానికి కవర్ల బదులుగా న్యూస్ పేపర్లను ఉపయోగించవచ్చు. తద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం.
న్యూస్ పేపర్లను ఉపయోగించి గిఫ్టు ప్యాకింగులు చేసుకోవచ్చు. కిటికీ అద్దాలు, వాహనాల అద్దాలు మెరవడానికి అద్దాలపై కొద్దిగా నీళ్లు చల్లి న్యూస్‌పేపర్‌తో తుడవాలి. అద్దాలపై మొండి మరకలు పోవాలంటే కాస్తంత టాల్కం పౌడర్ చల్లి న్యూస్ పేపర్‌తో తుడిస్తే మొండి మరకలు సైతం మాయమవుతాయి.