Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందులోని విటమిన్ 'ఎ' మన చర్మాన్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. విటమిన్ 'సి' మన చర్మంలోని కొల్లాజెన్ బంధాలను బలోపేతం చేసి చర్మం నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇందులోని పపైన్ కొత్త చర్మ కణాలు ఏర్పడేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు.. ఇది మన చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, మొటిమలు, రాషెస్ని తగ్గిస్తుంది.
తేనె మన చర్మానికి తేమను అందించే ముఖ్యమైన పదార్థం. దీన్ని బొప్పాయితో కలిపితే మన చర్మానికి చక్కటి హైడ్రేటింగ్ మాస్క్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మానికి తేమ అంది మెరుపు సంతరించుకుంటుంది.
దీని కోసం ఒక బౌల్లో అరకప్పు బొప్పాయి గుజ్జు, టేబుల్ స్పూన్ తేనె, రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆపై చల్లని నీళ్లతో కడిగేయాలి.
కొందరికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఈ మొటిమలను తగ్గించేందుకు బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు నిమ్మరసం, తేనెను కూడా ఉపయోగించండి. ఈ మూడు మొటిమలను అరికట్టేందుకు అద్భుతమైన పదార్థాలుగా చెప్పవచ్చు.
ఇందుకోసం బొప్పాయి గుజ్జులో టీస్పూన్ తేనె, ఒక నిమ్మకాయ రసం కలిపి ఫేస్‌ప్యాక్ తయారుచేసుకోవాలి. దీన్ని మీ చర్మానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా నాలుగైదు రోజులకు ఒకసారి చేస్తే మీ చర్మం మొటిమలు, మచ్చలు లేకుండా మెరిసిపోతుంది. ు