Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషిలోని అసంతప్తిని వెల్లడించే ప్రతికూలమైన వ్యక్తీకరణే కోపం. ప్రపంచంలోని ఏ మనిషీ దీనికి అతీతుడని చెప్పలేము. కోపంగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరును కోపం తగ్గిన తర్వాత మన మూర్ఖత్వమని అంగీకరించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే కోపమనే శత్రువును ప్రతిఒక్కరూ ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకోవాలి. ఇది ఎవరికి వారు చేయాల్సిన పని. ఇందుకోసం చేయాల్సినవి....
కష్టించి పని చేయటం, ఏ ఫలితమైనా స్వాగతించటం అలవరచుకుంటే కోపం రాదు. రోజూ క్రమం తప్పక చేసే యోగ సాధన వల్ల శారీరక, మానసిక దఢత్వం చేకూరి కోపం వంటి తీవ్రమైన భావోద్వేగాలు దూరమవుతాయి.
రోజూ కనీసం 6 నుంచి 8 గంటల సమయం తప్పక నిద్రకు కేటాయించటం ద్వారా కోపాన్ని నియంత్రించవచ్చు.కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం, సంగీతం వినటం, వ్యాయామాలు చేయటం మంచిది. స్నేహితులతో సరదాగా గడపటం, ఇష్టమైన భావాలను రాయటం, తోటపని, పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూడటం వల్ల సున్నితమైన భావాలు ఏర్పడతాయి.ు