Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. అలానే గుడ్డు పెంకులు కూడా కొన్ని అవసరాలకు పనికొస్తాయి. అవేంటో చదివేయండి..
- చీమలూ బొద్దింకలూ బాగా తిరిగే చోట గుడ్డు పెంకులను ఉంచితే, వాటి బెడద తగ్గుతుంది.
- కొత్త మొక్కలను పెంచాలనుకున్నపుడు .. గుడ్డు పెంకులను పొడిచేసి మట్టిలో కలుపుకుంటే, మొక్కల ఎదుగుదలకు మంచి పోషకంగా పనికొస్తుంది.
- వీటిల్లో మట్టి నింపి ధనియాలూ, ఆవాల గింజలు వేస్తే చిన్న మొక్కలు వస్తాయి. వీటిని గుడ్లు పెట్టుకొనే అట్టలో పెట్టి బాల్కనీలో ఉంచితే చూడ్డానికి బాగుంటుంది.
- ఇంట్లో పండ్లూ, కూరగాయలూ ఉంచినప్పుడు వాటి చుట్టూ పెంకుల పొడిని చల్లితే పురుగులూ, ఈగలూ రావు. గుమ్మం ముందున్న మొక్కలపై వీటిని చల్లితే చీడపీడలు పట్టవు.- వంటింటి గట్టుపై నూనె, పదార్థాల తాలూకు మరకలు పడితే వెనిగర్లో పెంకుల పొడి కలిపి అక్కడ రాయాలి. కొద్దిసేపయ్యాక కొబ్బరి పీచుతో రుద్దితే మరకలు వదిలిపోతాయి.