Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్లు పూసి పూసి విసుగెత్తిపోయారా? అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...
- ఒక స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు రుద్దాలి.
- క్యాబేజి/జీలకర్రలని నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం.
- గుడ్డు తెల్లసొన, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఇది చర్మానికి యవ్వనకాంతిస్తుంది.
- పొద్దుతిరుగుడుపువ్వు గింజల్ని పచ్చి పాలలో ఒక రాత్రంతా నానపెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకోవాలి.
- ఆలు లేదా టొమాటో రసాలను ప్రతిరోజూ రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
- మీగడలో బ్రెడ్ ముక్కలు కలిపి రాసుకున్నా చర్మం మృదువుగా తయారవుతుంది.