Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏళ్ల తరబడి రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం ఆడవారి ఆరోగ్యానికి ముప్పేనంటున్నారు పరిశోధకులు. ఎక్కువకాలం రాత్రి పూట పని చెయ్యడం వల్ల టైప్ 2 డయాబెటిస్, అధిక బరువు వంటివి రావొచ్చని హెచ్చరిస్తున్నారు వారు. అలాగే పొగతాగడం వంటి వ్యసనాల బారిన పడే అవకాశమూ హెచ్చేనట. నిరంతరంగా నిశివేళల్లో ఉద్యోగాలు చెయ్యడం వల్ల మన శరీరంలో ఉండే జీవగడియారం పనితీరులో తీవ్రమైన మార్పులొచ్చేస్తాయట. దాంతో నిద్ర, శక్తి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు - అన్నిటిలోనూ మార్పులొచ్చి, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.