Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని కాలాల్లో లభించటమే గాక చౌకగానూ లభించే పండు అరటి. ఆకట్టుకొనే రంగు , కమ్మని రుచితో పాటు సులభంగా జీర్ణమయ్యే అరటి అన్ని వయసుల వారికీ ఇష్టమైన ఆహారం. ఆరోగ్యానికి ఎన్నో విధాలా పనికొచ్చే అరటి పండు అందానికి చేసే మేలు గురించి తెలుసుకొందాం.
- ఒక అరటి పండు గుజ్జుకి చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే విటమిన్ ఏ లోపం నివారించబడి, పొడిబారిన చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
- అరటి పండు గుజ్జును కళ్లకింద ఏర్పడిన నల్లని వలయాల మీద రాసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే నలుపు పోతుంది.
- పగిలిన మడమలకు రోజూ అరటి పండు గుజ్జు రాసి పావుగంట తర్వాత కడుగుతుంటే వారంలో మంచి మార్పు కనిపిస్తుంది.
- ఒక అరటి పండు గుజ్జు, అర కప్పు పెరుగు కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు పరిష్కారం అవుతాయి.
- మొటిమలు ఉన్నవారు అరటి తొక్కతో 5 నిమిషాలు ముఖాన్ని మర్దన చేస్తే వారంలో మొటిమలు మాయమవుతాయి.
- అరటి తొక్క గుజ్జుకు గుడ్డుసొన కలిపి ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి 10 నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మృదువుగా మారుతుంది. ు