Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో నిద్రలో గురక పెడతారు. గురక అంత సహజమైన చర్య. గురక పెట్టి నిద్రపోతే బాగా నిద్ర పోయారని అనుకుంటాం. కానీ నిజానికి గురక వల్ల గాఢనిద్రలోకి జారుకునేలోపే మెలకువ వచ్చి నిద్రాభంగం అవుతుంది. గురక వల్ల పక్కవారికి కలిగే అసౌకర్యం కంటే... గురక పెట్టేవాళ్ల ఆరోగ్యానికి జరిగే నష్టమే ఎక్కువ!
గురకకు కారణం శ్వాసనాళంలో ప్రకంపనలకు గురయ్యే మెత్తని కణజాలమే! లోపలికి, బయటకు వెళ్లే గాలి కారణంగా గొంతులో ఉండే కండరాలు కదలికలకు లోనై శబ్దాన్ని వెలువరుస్తాయి. అయితే సాధారణంగా నిద్రలో ఉన్నప్పుడు గురకతో మనంతట మనకే మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనల్ని నిద్ర లేపేది గురక శబ్దం కాదు. ఆ సమయంలో శ్వాసనాళం కుంచించుకుపోయి, మెదడుకు సరిపడా గాలి అందకపోవడం వల్ల శరీరం తనంతట తాను అప్రమత్తమై, నిద్ర మెలకువ అయిపోతుంది.
- స్థూలకాయం, నాలుక పెద్దగా ఉండడం, కొండ నాలుక పెద్దగా ఉండడం, దవడల నిర్మాణంలో తేడాలు ఉన్నవారికి గురక సహజం. గురక రాకుండా ఉండాలంటే అందుకు కారణమయ్యే అంశాలను నియంత్రించుకోవాలి.
- వెల్లకిలా పడుకుని నిద్రపోతే, నాలుక గొంతులోకి జారే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కకు తిరిగి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
- తల కింద ఎత్తు ఉంచి పడుకోవాలి.
- మద్యపానం వల్ల శ్వాసనాళం దగ్గరి కండరాల మీద నియంత్రణ కోల్పోతాం. అందుకే మద్యపానానికి దూరంగా ఉండాలి.