Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణ నడుమునొప్పి, డిస్క్ సమస్యలు, సయాటికా సమస్యలకు కాపడం పెట్టటం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. దీన్నే హాట్ ప్యాక్ అంటారు. వదలని దీర్ఘకాలిక నొప్పులకు, నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు, నెలసరి నడుము నొప్పికీ వేడికాపడం మంచి ఫలితాన్నిస్తుంది.
- హాట్ ప్యాక్ వల్ల నరాలు ఉత్తేజం చెంది ఆ భాగపు మలినాలు చెమట ద్వారా బయటికిపోతాయి. దీనివల్ల కండరాలూ ఉపశమనాన్ని పొందుతాయి.
- హాట్ ప్యాక్ ప్రభావం చర్మం పైపొరలకే గాక లోపలి కండరాల మీద కూడా ప్రభావం చూపి, అక్కడి రక్తప్రసరణను పెంచుతుంది. దీంతో ఆ భాగంలో జీవక్రియల వేగం పెరిగి క్రమంగా ఆ అవయవపు పనితీరు సాధారణ స్థితికి వస్తుంది.
- కొద్దికొద్దిగా కాపడం పెడుతూ 10-15 నిమిషాలు కొనసాగించాలి. వేడినీటిలో ముంచి పిండిన బట్టను గానీ, పొడి బట్టను వేడి పాత్ర మీద ఉంచి వేడి చేయడం ద్వారాగానీ, వేడినీటి సంచిని పెట్టటం ద్వారానూ కాపడం పెట్టొచ్చు. ఇప్పుడు దీనికోసం ఎలక్ట్రిక్ హీట్ ప్యాక్స్, వ్యాక్స్ వంటివీ అందుబాటులో ఉన్నాయి. ప