Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మగ్గాలపై తయారయ్యే నేత చీరలకు డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. బళ్ళారికి దగ్గరలో ఉన్న ఇల్కాల్ అనే చిన్నపట్టణం ఈ చీరలకు ఎంతగానో ప్రసిద్ధి. నూలు, పట్టు మిశ్రమంతో చీరను ఎన్నో డిజైన్లలో నేస్తారు. ఈ చీరకున్న మరో ప్రత్యేకత పైట కొంగు విడిగా తయారుచేసి జాయింట్ చేస్తారు. నూలుదారాల పైన రంగుల సిల్క్ లేదా ఆర్ట్ సిల్క్ పోగుల్ని కలుపుతూ అల్లిక పూర్తి చేస్తారు . చీరపైన కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగుగా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది.