Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడు తుంటే ఎప్పుడూ ముగిస్తారా అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఏదో ఒకటి మాట్లాడామా అన్నట్లుగా కాకుండా... అందరినీ అలెర్ట్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించడం ముఖ్యం.... అవే ఇవి...
ఎంతసేపు మాట్లాడమన్నది ముఖ్యం కాదు ఏం మాట్లాడామన్నది ముఖ్యం.
సంభాషణ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండాలి. మధ్య మధ్యలో కాస్త సరదాగా మాట్లాడితే వినేవారికి హాయిగా ఉంటుంది.
ఒక విషయం మీద వాదన చేస్తున్నప్పుడు ఏదోలే అన్నట్లు కాకుండా ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొంగి చూడాలి.
చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పకూడదు.
మాట్లాడటం అంటే సజనాత్మక ప్రక్రియ. సంభాషణ ఎలా మొదలుపెట్టాలి. ఎలా ముగించాలనే విషయం మీద అవగాహన ఉండాలి.