Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం నిత్యం వాడే సహజవనరులలో వంటగ్యాస్ అతి ముఖ్యమైనది. . దీన్ని జాగ్రత్తగా వాడాలి. అప్పుడే సురక్షితం, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా వంటింటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ అగ్నిప్రమాదాలతో ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు.
గ్యాస్ స్టవ్ వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. స్టవ్, గ్యాస్ రెగ్యులేటర్.. ఇతర పరికరాలు కచ్చితంగా నాణ్యమైనవి ఎన్నుకోవాలి. తరుచూ స్టౌను శుభ్రపరుస్తూ ఉండాలి.
- సిలిండర్ కంటే కాస్త ఎత్తులో స్టవ్ ఏర్పాటు చేసుకోవాలి. నేరుగా సూర్యరశ్మి పడకుండా, ఎలక్ట్రికల్ పాయింట్స్ దగ్గరగా లేకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఇతర దీపాలు, క్రిమికీటకాల మందులు, స్ప్రే బాటిల్స్ స్టవ్ దగ్గరలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఈ ముందు జాగ్రత్తలతో పాటు గ్యాస్ ఆదా చేయడంలో ఈ చిట్కాలు మరవద్దు..
- వంటకు అన్నీ సిద్ధం చేసుకున్నాకే స్టవ్ వెలిగించాలి. ముఖ్యంగా నాబ్ తిప్పేసి లైటర్ వెతుక్కోకూడదు.
- వంటలకు సరియైన పాత్రలను మాత్రమే వినియోగిచాలి. అంటే పరిమాణం, ఉష్ణవాహకాలపై దష్టి పెట్టాలి.
- వంట పాత్రలపై విధిగా మూత పెట్టాలి. ప్రెషర్ కుక్కర్ వినియోగిస్తే చాలా మేలు.
- ఫ్రిజ్‌లో నుంచి తీసిన పాలు, ఇతర పదార్థాలను వెంటనే స్టవ్‌పై పెట్టకూడదు.
- బియ్యం, పప్పు దినుసులు.. వగైరా వంటకు ముందే నానబెట్టుకుంటే గ్యాస్‌తో పాటు సమయం వథా ఉండదు.
- తరుచూ బర్నర్లను శుభ్ర పరచాలి. నాబ్స్, పైప్ నుండి ఏమైనా గ్యాస్ లీక్ అవుతోందా అని గమనించాలి.
- వంట సమయంలో ఎక్జాస్ట్ ఫ్యాన్ వేసుకోవాలి. ఇతర ఫ్యాన్ల వల్ల కాని, కిటికీల్లో నుంచి కాని స్టవ్ వద్ద అతిగా గాలి వీచకూడదు.
- వంట పూర్తయ్యేవరకు గ్యాస్ స్టవ్ దగ్గరే ఉండడం మంచిది. అప్పుడే వంటలు రుచికరంగా వండుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలు పొంగి బర్నర్‌పై పడే ప్రమాదం తప్పుతుంది.