Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గాలనుకునే వారు నల్లద్రాక్షను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదంటున్నారు ఆహారనిపుణులు. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇందులోని ఫైబర్ ఆకలి కాకుండా నిరోధిస్తుంది. దీంతో మితంగా ఆహారం తీసుకుంటాం. బరువు తగ్గడం సులభం.
అధిక రక్తపోటును నియంత్రించాలంటే రోజూ గుప్పెడు నల్లద్రాక్షను తినాలి. నల్లద్రాక్ష రక్తంలోని చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. వారంలో నాలుగైదుసార్లు వీటిని తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వీటిల్లోని పాలీఫెనాల్ మెగ్రెయిన్ తలనొప్పిని, మతిమరుపును అదుపులో ఉంచుతుంది. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. పైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించిఅక్కడి కండరాలు సక్రమంగా పనిచేసేలా చూస్తాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.