Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ తరానికి చిరుతిండి అంటే జంక్ ఫుడ్ అని మాత్రమే తెలుసు. రుచికి బాగానే ఉన్నా దీనివల్ల ఊబకాయం మొదలు హద్రోగ సమస్యల వరకు పలు అనారోగ్యాల బెడద ఎక్కువవుతున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడవుతోంది. అలాగని జుంక్ ఫుడ్ అసలే మానుకోవలసిన అవసరం లేదుగానీ దాన్ని పరిమితం చేస్తే చాలు. జంక్ ఫుడ్ విషయంలో పిల్లలు, యువతతో బాటు అందరూ పాటించ దగిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
- ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తిని మిగిలిన సమయాల్లో మానుకోవాలి.
- ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకునే బదులుగా కొద్ది మొత్తాన్ని దఫదఫాలుగా తీసుకోవాలి.
- పిజ్జా, బర్గర్లకు బదులుగా చిరు ధాన్యాలతో ఇంట్లో చేసుకునే పదార్థాలను తినాలి.
- డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారానికి బదులుగా అప్పటికప్పుడు చేసుకున్న తాజా ఆహారాన్నే తినాలి.
- మార్కెట్లో రెడీమేడ్ ఫుడ్ కొనే ముందు దాని లోని పోషకాల వివరాలను గమనించాలి.
- కత్రిమ రంగులు వాడిన ఆహారానికి దూరం గా ఉండాలి.
- వంటరాని వారు కనీసం ఆమ్లెట్ వంటి అయి దారు రకాల ఆహార పదార్థాల తయారీ నేర్చు కుంటే బయటి ఆహారం మీద ఆధారపడటం తగ్గుతుంది.
- తరచూ వేపుడు కూరలు తినేవారు ఆవిరిమీద ఉడికించిన వంటలు, సలాడ్స్ తీసుకోవాలి.
- ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసే అలవాటుకు స్వస్తి చెప్పి అప్పుడప్పుడూ పండ్లు, బ్రెడ్‌తో సరిపెట్టు కోవాలి.
- అన్నిటికన్నా ముఖ్యంగా జంక్ ఫుడ్ మాను కోవటం కష్టమనే ఆలోచనను మన సులో నుంచి తీసేయాలి.