Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలు ముందుకు సాగదీయాలి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులు పైకి సాగదీసి, శ్వాసని వదులుతూ రెండు చేతులతో కాలి మడమ దగ్గర ఇంటర్ లాక్ చేయాలి. కాలి మడమ దగ్గర ఇంటర్ లాక్ చేయడం రాకపోతే ఎంతవరకు చేతలు సాగదీయగలరో అంత వరకే చేతులు సాగదీసి కాలిని పట్టుకోవాలి. ఈ ఆసనంలో 20 సెకన్లు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తి రిలాక్స్ కావాలి. ఇదే విధంగా ఎడమ కాలు ముందుకు సాగదీసి చేయాలి.
ఉపయోగాలు
- నడుము, వెన్నుముక బాగా సాగి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
- పీసీఓడి, పీసీఓస్ సమస్యలు అదుపులో ఉంటాయి.
- చక్కర వ్యాధి అదుపులో ఉంటుంది.
- జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది.
- ముఖకాంతి మెరుగవుతుంది.
- చేతులలో ఉన్న అనవసరపు కొవ్వు కరుగుతుంది.
జాగ్రత్తలు
- నడుము నొప్పి తీవ్రంగా ఉంటే ఈ ఆసనం చేయకూడదు.
- పొట్టకి సంబంధించిన సర్జరీలు అయిన వారు ఈ ఆసనం సాధన చేయవద్దు.