Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేనెటీగలు వంటి కొన్ని పురుగులు కుట్టినపుడు వాటి ముల్లు మన చర్మంలో ఉండిపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ముల్లు కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. ముల్లు మరీ చర్మం లోపలి దాకా వెళ్లే అవకాశం తక్కువ కాబట్టి, ఏదన్నా అట్టముక్కతో సున్నితంగా గీరితే ముల్లు రాలిపోతుంది.
- పురుగు కుట్టిన ప్రదేశాన్ని సబ్బు నీటితో కడగండి. అంతేకానీ నలపడం కానీ వత్తడం కానీ చేయకూడదు.
- గాయంపై కొన్ని నిమిషాల పాటు ఐస్ ముక్కని ఉంచితే, విషం శరీరంలోకి త్వరగా పాకకుండా ఉంటుంది. ఆ చల్లదనానికి నొప్పి కూడా తగ్గుతుంది.
- సోడా ఉప్పు కలిపిన నీటిలో దూదిని ముంచి గాయంపై ఉంచండి. దానివల్ల దురద, వాపు నుంచి కొంచెం ఉపశమనం లభించవచ్చు.
- ఎంతసేపు గడిచినా నొప్పి, వాపు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. వారు అలర్జీని తగ్గించే మందులను సూచిస్తారు.