Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుచికరమైన వంటల్ని అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది వంటిల్లు. అదెలాగంటే వంట చేసేటప్పుడు చెయ్యి కాలితే వెంటనే బర్నాల్ కోసం పరిగెత్తక్కర్లేదు. మీ పక్కనే ఫస్ట్‌ఎయిడ్ చేసేందుకు ఉల్లి ఉంటుంది.
- వంట చేసేటప్పుడు కాలినా, వేడినీళ్లు లేదా నూనె పడి బొబ్బలు వచ్చినా ఉల్లిపాయను సగానికి కోసి కాలిన గాయం మీద పెట్టి నొప్పి తగ్గేవరకు ఉంచాలి. ఉల్లిరసంలో ఉండే సల్ఫర్ వంటి రసాయనాలు బాధ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
- విపరీతమైన ఒత్తిడి, సరిపడా విశ్రాంతి లేకపోవడం వల్ల తలనొప్పి రావడమనేది సహజం. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇటువంటి తలనొప్పులకు, మైగ్రేన్‌కి బెస్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా చల్లదనం. ఫ్రోజెన్ (డీప్ ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడ్డ) బఠాణీల బ్యాగ్‌ను నొప్పి ఉన్న ప్రాంతంలో పది నిమిషాల సేపు ఉంచాలి. 20 నిమిషాలు ఆగి మరో పది నిమిషాలు ఫ్రోజెన్ బఠాణీల బ్యాగ్‌ను ఉంచాలి. అతి చల్లదనం వల్ల రక్త నాళాల మీద ఒత్తిడి కలిగి ఉపశమనం కలుగుతుంది.
- రాత్రిళ్లు ఎక్కువ సేపు మెలకువగా ఉండడం, తక్కువ నీళ్లు తాగడం, వయసు ప్రభావం వల్ల కళ్ల చుట్టూ ఉబ్బుతుంది. ఈ ఉబ్బు కంటికింది భాగంలోని త్వచంలో ద్రవాలు చేరడం వల్ల ఏర్పడుతుంది. ఇదేకాకుండా చర్మం మీద ఎక్కడ వాపు వచ్చినా చల్లదనాన్ని మించిన ఇంటి చికిత్స మరోటి లేదు. దీనికే మరో టిప్ ఏమిటంటే ఉదయం లేదా సాయంత్రం టీ తాగిన తరువాత టీ బ్యాగులను రిఫ్రిజిరేటర్లో పెట్టి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. టీ నీళ్లు కారిపోయి ముఖంపై కారకుండా ఉండేందుకు టీ బ్యాగులను ఒకసారి పిండాలి. ఆ తరువాత కళ్ల మీద పెట్టి పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉండే ఉబ్బు తగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి. ఇలా చేసిన తరువాత ఎంతో తాజాగా ఉంటుంది కూడా.