Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో వాడే పంచదారకి, చేసి పెట్టుకున్న తీపి వంటకాలకి చీమలు పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే కొన్ని మ్యాజిక్‌లు చేస్తే చాలు ఇట్టే పారిపోతాయి.
పంచదారకి చీమలు పడుతుంటే ఆ డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చాలు.
నల్లచీమలు ఎక్కువగా ఉన్నచోట మెత్తని సాల్ట్ చల్లితే అవి వెంటనే పోతాయి.
ఇంట్లో ఒక్కొక్క చోట చీమలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి ప్లేస్‌లో కిరోసిన్ చల్లితే ఫలితం ఉంటుంది.
ఇంకో విచిత్రం ఏంటంటే దోసకాయ తొక్కల్ని చీమలు ఉన్నచోట పెడితే అవి అక్కడనుంచి పారిపోతాయి.
పంచదార, బెల్లంతో చేసిన వంటకాల డబ్బాలకి చీమలు పట్టకుండా ఉండాలంటే కంటైనర్ చుట్టూ ఆముదం రాస్తే మంచిది.
తేనె సీసాకి చీమలు పట్టకూడదు అనుకుంటే ఆ సీసాలో నాలుగు మిరియాలు వేసి చూడండి.
ఇలా కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చీమల బెడద మటుమాయం అవుతుంది.