Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. అయితే కాటుక వినియోగం విషయంలో ఈకింది అంశాలను పరిగణలోకి తీసుకుంటే కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అవి..
- కాటుక పెట్టుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్లపై తడిలేకుండా తుడుచుకోవాలి.
- ఎక్కువగా చెమట పట్టే చర్మంగలవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు.. ముఖాన్ని ఐస్ ముక్కలతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల చెమట పట్టడం తగ్గి తద్వారా పెట్టిన కాటుక చెదరకుండా ఉంటుంది.
- కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. లేదా కొద్దిగా పౌడర్ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్ పీల్చుకొని కళ్లు తాజాగా ఉంటాయి.
- కనురెప్పల కొనభాగంలో కాటుక పెట్టుకొంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ గనుక కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి.
- కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్ కలర్ ఐషాడో బేస్‌గా వేసుకొన్నా కాటుక చెదిరిపోకుండా చూసుకోవచ్చు.
- నాణ్యమైన కాటుక వాడాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటపుట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాటుక వాడటం ఆపాలి.