Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిమ్‌కి వేసుకునే దుస్తులు బిగుతుగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్లయితే చాలా అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. కదలికలకు, కొన్నిసార్లు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాస్త వదులుగా ఉండేవే వేసుకోవాలి. అలాగే షూ కూడా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి.
వ్యాయామానికి ముందు వార్మప్ చాలా అవసరం. నేరు గా వెళ్లి మొదలుపెట్టేస్తే గుండె వేగం పెరిగి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం త్వరగా శక్తిని కోల్పోయి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే వార్మప్ చేశాకే వ్యాయామం మొదలు పెట్టాలి.
శరీరాన్నిహైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. జిమ్ కి వెళ్లడానికి ముందు కొద్దిగా నీళ్లో, జ్యూసో తాగండి. అలా అని కడుపు నిండేలా తాగకూడదు.
మొదట్లో మనకు మనమే ఎక్విప్ మెంట్ని యూజ్ చేయాలని ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఇన్ స్ట్రక్టర్ ని అడిగి వాళ్లు చెప్పిన విధంగానే చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే కండరాలు పట్టేస్తాయి. ఎముకలు డ్యామేజయ్యే ప్రమాదం కూడా వుంది.
ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేసేయాలని అనుకోకూడదు. మెల్లగా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి. లేదంటే విపరీతంగా ఒళ్లు నొప్పులు వచ్చి వ్యాయామం చేయడం కష్టమైపోతుంది.
వ్యాయామం చేస్తున్నంతసేపూ మనసుని రిలాక్స్‌గా వుంచుకోండి. ఆ సమయంలో చక్కని
సంగీతం వినండి. చాలా జిమ్స్‌లో ఈ సౌకర్యం ఉంది.