Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఎక్కువ మంది జంటలు 35 దాటిన తరువాతే గర్భధారణకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే పోటీ ప్రపంచంలో యువకుల ప్రాధాన్యతలు మారిపోయాయి. కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పిల్లల గురించి ఆలోచించ వచ్చని అనుకుంటున్నారు. అందుకే వివాహం అయిన వెంటనే కాకుండా పిల్లల కోసం కొద్ది కాలం ఆగుతున్నారు. ఈ నిర్ణయం మంచిదే అయినా మరీ ఆలస్యం చేయడం కూడా మంచిది కాదంటున్నారు వైద్యులు. పిల్లల్ని కనేందుకు 35 సంవత్సరాల వరకు ఆగితే ఎదురయ్యే సమస్యల గురించి స్త్రీ వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం...
త వయసు పెరుగుతున్న కొద్దీ అండాల విడుదల సంఖ్య తగ్గిపోతుంది. దానివల్ల మీకు నచ్చినప్పుడు గర్భం దాల్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి.
త వయసుతో పాటు కొన్నిరకాల సమస్యలు (ఫాలోపియన్ ట్యూబ్‌లు మూసుకుపోవడం, ఎండ్డో మెట్రియాసిస్) వంటివి గర్భధారణని నిరోధిస్తాయి.
త వయసు మీద పడిన తరువాత గర్భం ధరించాలి అనుకుంటే పుట్టే బిడ్డలో లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి. 40ల్లో గర్భం దాల్చితే పుట్టే పిల్లలో 30 మందిలో ఒకరికి లోపాలు ఉండవచ్చు. కానీ 30ల్లో అయితే 1000 లో ఒకరికి మాత్రమే ఆ ప్రమాదం ఉంటుంది. అంటే మీరు వయసులో ఉన్నపుడే పిల్లల్ని కనడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మను ఇవ్వొచ్చు.
త ఒక నిర్దిష్ట వయసు తరువాత నొప్పులకు సంబంధించిన బాధను భరించడం చాలా కష్టం.
త 35 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషుడు ఇద్దరిలో గర్భధారణ సమస్యలు పెరుగుతాయి.
కాబట్టి సరైన వయసులో సరైన నిర్ణయం తీసుకుని గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఆరోగ్య వంతమైన పిల్లలకు జన్మనివ్వడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.