Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాపింగ్ వెళ్లినప్పుడల్లా కంటికి నచ్చిన చీరలు కొనేస్తూ ఉంటాం. కొనేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ చీరలతో బీరువా నిండిపోయినప్పుడు ఏ చీర కట్టుకోవాలో తికమకపడుతుంటాం. అయితే మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకశైలి ఉంది. అవి వస్త్రధారణ కావొచ్చు, ఆహారపు అలవాట్లు కావొచ్చు. గతంలో ఆ ప్రాంతానికే పరిమితమైన సాంప్రదాయాలు మారుతున్న కాలంతో పాటుగా రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు వ్యాపించాయి. కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పండుగలు, సరదాలు ఇప్పుడు అన్ని చోట్లా జరుపుకుంటున్నారు. హిల్సా, రసగుల్లా, ప్రముఖ రచయితలకు బెంగాల్‌ని కేంద్రంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు స్టైల్‌గా ఉండటంలోనూ బెంగాలీలు ఫేమస్. బెంగాలీ ఆడపడుచుల సాంప్రదాయ వస్త్ర ధారణ ఇప్పుడు దేశం మొత్తం విస్తరించింది. మీ బీరువాలో వున్న చీరలతో బెంగాలీ చీరకట్టును ట్రై చేయండి. చీర పాతదైనా కొత్తగా కనిపిస్తారు.