Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా కలకలమే. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. తినడానికి ముందు, తిన్న తర్వాత, ఏదైనా పని చేసే ముందు తర్వాత ఇలా ప్రతి పనికి ముందు శానిటైజర్స్ వాడడం చాలా మంచిది. దీంతో శానిటైజర్స్‌కి ఫుల్ గిరాకీ పెరిగింది. అలాంటి శానిటైజర్‌ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
కావల్సినవి: అర బాటిల్ రబ్బింగ్ ఆల్కహాల్, రెడు స్పూన్ల అలొవెరా జెల్, ఎనిమిది చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, స్క్వీజ్ బాటిల్ ఒకటి.
ఎలా చేయాలంటే: ముందుగా ఓ బౌల్ తీసుకోవాలి. అందులో సగం బాటిల్ రబ్బింగ్ ఆల్కహాల్ వేయాలి. ఇప్పుడు అందులోనే రెండు స్పూన్ల అలోవెరా జెల్‌ని వేయాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. బాగా మిక్స్ తర్వాత అందులో ఎనిమిది చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. అయితే తీసుకున్న పదార్థాలన్నీ స్పూన్‌తో బాగా కలపాలి. ఇలా తయారైన శానిటైజర్‌ని నీటి తడిలేని స్క్వీజ్ బాటిల్లో పోసుకోవాలి. అయితే, ఇదే ఒక్కసారిగానే ఎక్కువ పరిమాణంలో చేసుకోకూడదు. వారానికి సరిపోయేలా చేసుకుంటే సరిపోతుంది.
ఉపయోగాలు: ఎసెన్షియల్ ఆయిల్లో సూక్ష్మీ క్రిములను చంపే ప్రత్యేక గుణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని కచ్చితంగా కలపాలి. ఇందులో ఎలాంటి ఫ్లేవర్ ఎసెన్షియల్ అయినా వాడొచ్చు.