Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం మనందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ఏకైక మార్గం వ్యక్తిగత పరిశుభ్రత మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఇతరుల నుంచి మనకు, మన నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ మాస్క్‌లు ధరించడం తప్పదు. అయితే ఇలాగని ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మాస్క్‌లు ధరించి ఉండవలసిన అవసరం లేదు. మాస్క్ ఎవరు వేసుకోవాలంటే....
- దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు విధిగా మాస్క్ ధరించాలి. అలాగే, కుటుంబంలో ఎవరికైన కోవిడ్ 19 సోకినట్టు అనుమానం ఉంటే ఆ వ్యక్తి కుటుంబం సభ్యులు విధిగా మాస్క్ ధరించాలి. వైరస్ సోకిన రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులు, నర్సులు, సిబ్బంది మాస్క్ ధరించాల్సి ఉంటుంది.
- మాస్క్ ధరించడం పెద్ద విషయం కాదు.. కానీ ఆ మాస్క్‌ను ఏ విధంగా వాడాలి? ఏ విధంగా డిస్పోజ్ చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు.
- మాస్క్ ముడతలు ఊడదీయాలి. ఆ ముడతలు కింది వైపుకు ఉండేలా చూసుకోవాలి.
- ముక్కు, నోరు, కింది దవడ కవర్ చేసే విధంగా, గాలి చొరబడకుండా ఉండేలా మాస్క్‌ను అడ్జస్ట్ చేసుకుని కట్టుకోవాలి.