Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్వేరియంలోని చేపలను చూస్తుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగని ఇంట్లో పెద్ద పెద్ద అక్వేరియాలను అమర్చుకోవాలనే నియమం ఏమీలేదు. చిన్న ఫిష్ బౌల్లో కూడా రెండు చేపలను పెంచుకోవచ్చు. సాధారణంగా గోల్డ్‌ఫిష్ అయితే ఇట్టే ఆకుట్టుకుంటాయి. అయితే వీటి సంరక్షణ ఎలా? అనేనా మీ సందేహం. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇక మీ అక్వేరియంలో మూడు గుడ్లు - ఆరు చేపపిల్లలే..!
- ఇంట్లో చక్కగా గాలి, వెలుతురు ప్రసరించే ప్రాంతంలోనే ఫిష్ బౌల్ లేదా అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి. వీటి కోసం టీవీ, ఫ్రిజ్.. వంటి వాటిమీద కాకుండా హాల్లో ఒక టేబుల్ లేదా స్టాండ్‌ను ఉపయోగించడం ఉత్తమం.
- బౌల్ అయితే రెండు ఫిష్‌లకు మించి వేయకూడదు. ఇక అక్వేరియం సైజ్‌ని
దష్టిలో పెట్టుకుని ఎన్ని ఫిష్‌లు వేయాలో చూసుకోవాలి. ఇళ్ళల్లో ఎక్కువగా గోల్డ్ ఫిష్‌లను ఇష్టపడతారు. ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడమే కాక ఇంటి అందం ద్విగుణీకతం అవుతుంది.
- ఎక్కువ చేపలు లేదా వివిధ రకాల చేపలను ఒకే చోట చేర్చడం వల్ల అవి ఎంతోకాలం మనలేవు.
- అక్వేరియంలో రక్షిత మంచినీటిని వాడకూడదు. బోర్ నీళ్లు మాత్రమే వాడాలి. ఇవి అందుబాటులో లేని పక్షంలో రక్షిత నీటిని మూడు రోజుల పాటు నిల్వ చేసి వాడుకోవచ్చు. అలాచేయడం వల్ల క్లోరైడ్ ప్రభావం తగ్గుతుంది. లేదంటే చేపలు చనిపోతాయి.
- ఫిష్బౌల్ అయితే మూడు రోజులకు, అక్వేరియం అయితే వారం రోజులకు ఒకసారి శుభ్రం చేసి నీటిని విధిగా మార్చవలసి ఉంటుంది.
- ఫిష్ ట్యాంక్ శుభ్రపరిచే సమయంలో చేపలను వల సహాయంతో మరొక నీటి తొట్టిలోకి మార్చుకోవాలి.
- వీటికి ఆహారం రోజుకు ఒకసారి మాత్రమే వేయాలి. చేపల సంఖ్యను బట్టి వేయాలి.
- అక్వేరియం పెద్దదయితే వాటికి అనువైన మొక్కలను కూడా పెంచుకోవచ్చు.
- అక్వేరియంలో అందానికి వాడే లైట్, రాళ్ళు, ప్లాస్టిక్ మొక్కలు, బొమ్మలు.. వంటి వాటి విషయంలో తగుజాగ్రత్తలు అవసరం.
- అక్వేరియం సైజ్‌కి సరిపడా ఎయిర్ పంప్‌ను ఏర్పరచుకోవడం తప్పనిసరి.
- చేపల పెంపకం గురించిన జాగ్రత్తలు పిల్లలకు వివరించడంతో పాటు ఇతర పెంపుడు జంతువులకు అక్వేరియం అందకుండా జాగ్రత్త పడాలి.
- బంధుమిత్రలకు వివిధ సందర్భాలలో గిఫ్ట్‌లా కూడా పెట్ ఫిష్‌లను, అక్వేరియంని ప్లాన్ చేయవచ్చు.