Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళగా పుట్టినందుకు చాలా మంది బాధపడుతూ వుంటారు. ఈ సమాజంలో అన్ని రకాల కష్టాలు తమకే వస్తున్నాయని దిగులుపడుతూ వుంటారు. ఇది కొంత వరకు వాస్తవమే. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులతో పాటే మహిళలకు మాత్రమే వున్న కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. అందుకే మహిళలుగా పుట్టినందుకు మహిళలు గర్వపడాలంటున్నారు నిఫుణులు. ఆ అనుకూల పరిస్థితులు ఏమిటో చూద్దాం...
మల్టీ టాస్కింగ్: మల్టీ టాస్కింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది మహిళలే. వారికీ ఈ విషయంలో సాటి లేరు. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. సైన్స్ చెబుతుంది. ఎందుకంటే మహిళలు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఇంటి పనులు చేసుకోవడం, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం ఆఫీసుకు వెళ్ళడం ఇలా ప్రతి విషయంలోనూ మహిళలు ఎంజారు చేస్తుంటారు.
ఎక్కువ కాల జీవనం: సహజంగా పరిశీలిస్తే స్త్రీల కంటే పురుషులే త్వరగా చనిపోతారు. హార్వర్డ్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం మహిళలు తమ పిల్లలు, మనవరాళ్లను పెంచడానికి సాయపడతారు. ఫలితంగా వారిలో ఒత్తిడి తక్కువగా వుండి ఎక్కువ కాలం బతికే అవకాశం వుంది.
నెలసరి సమయంలో: పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పి, తిమ్మిరితో ఇబ్బంది పడతారు స్త్రీలు. కానీ ఆ సమయంలో ఇష్టపడినవి తినే వెసులు బాటు కొందరికైనా వుంటుంది. ఇలాంటి టైమ్‌లోనూ మహిళలు ఆనందంగా ఉంటారు. అన్ని సమస్యలను తట్టుకుంటారు.
మంచి కమ్యూనికేటర్స్గా: జీవితంలోని అన్ని అంశాలలో కమ్యూనికేషన్ ముఖ్యం. ఈ విషయంలో స్త్రీలే బెటర్ అని చెబుతున్నాయి పరిశోధనలు. మాంచెస్టర్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం పురుషులు మాట్లాడటం కోసమే ఎక్కువగా మాట్లాడుతుండగా, మహిళలు సూటిగా విషయానికి వస్తారని తెలిపారు. దీన్ని బట్టి మహిళలు చాటర్ బాక్స్‌లు అనేది నిజం కాదని ఈ పరిశోధనలో తేలింది.
ఎన్నో రకాల ఫ్యాషన్లు: మహిళల దుస్తుల్లో ఎప్పటి కప్పుడు కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. వర్క్, వెడ్డింగ్, పార్టీస్ ఇలా సందర్భానికి తగ్గ దుస్తులు ధరించవచ్చు. అయితే మగవారిలో మాత్రం రెండు, మూడు వెరైటీస్ మాత్రమే ఉన్నాయి. అదే మహిళలకు లెహంగా, గాగ్రాస్ వంటి అనేక రకాల దుస్తులను ఆస్వాదించవచ్చు.
పురుషుల కంటే మెరుగైన జ్ఞాపకశక్తి: కొంతమంది పురుషులలో చాలా మతిమరుపు ఉంటుంది. కానీ అది వారి తప్పు కాదు. జ్ఞాపకశక్తిని నియంత్రించే మెదడులోని భాగమైన హిప్పోకాంపస్ వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో తగ్గిపోతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. స్త్రీలలో ఈ సమస్య చాలా తక్కువ.