Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాటన్ దుస్తులను ఎవరైనా ఇష్టపడతారు. ఇక ఎండాకాలంలో అయితే వీటిని తప్ప మరొకటి వేసుకోవడం చాలా కష్టం. ఉక్కపోతను భరించాలంటే కాటన్ దుస్తులే బెటర్. వేసుకోవడం వరకు ఓకే. వీటికి ఎప్పటికప్పుడు గంజి పెడుతూ, ఇస్త్రీ చేసుకుంటేనే ఎక్కువ కాలం మన్నికగా వుంటాయి. రోజూ ఆఫీసు హడావుడిలో ఉరుకుల పరుగులతో ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు అనివార్యంగా అందరం ఇండ్లకే పరిమితమయ్యాం. ఇప్పటికైనా బీరువాలో దాచిపెట్టిన కాటన్ బట్టలను బయటకు తీయండి. చక్కగా గంజి పెట్టి తయారు చేసుకోండి. మీ పాత కాటన్ బట్టలు కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఎక్కువ కాలం నిలుస్తాయి.