Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తిమీర సొంతం. అయితే కొత్తిమీర రుచిలోనే కాదు, ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా అద్బతంగా సహాయపడుతుంది. దీనిని తరచూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
- కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. ఇందులో మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్లు తగిన మోతాదులో లభిస్తాయి.
- దీనిలో విటమిన్ సి, కె లతో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
- మధుమేహంతో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంలా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమన్వయపరుస్తుంది.
- దీనిలో వుండే విటమిన్ కె వయసు మళ్లిన తరువాత వచ్చే మతిమరుపు వ్యాధి నియంత్రణలో కీలకంగా పని చేస్తుంది. అంతే కాకుండా కొవ్వును కరిగించే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో అధికంగా లభిస్తాయి.
- కొత్తిమీరలోని యాంటీసెప్టిక్ లక్షణాలు నోటిపూతను తగ్గి స్తాయి. అంతే కాకుండా మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను తగ్గిస్తాయి.
-ఇందులోని యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.