Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చల్లని ఆహారం వద్దు: పిరియడ్స్ సమయంలో చల్లగా ఉండేవి కాకుండా కాస్త వేడిగా ఉండే సూప్స్, వేడి ఆహారం తీసుకోవడం వల్ల నొప్పులు కాస్త తగ్గుతాయి.
వేడి వేడి ఛారు : వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం అంటే చాలా దేశాల్లో వేడి వేడి టీ, చక్కటి పసుపు టీ వంటివి తీసుకుంటారు. ఇవి పిరి యడ్స్ సమయంలో వచ్చే నొప్పిని బాగా తగ్గిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావడం వల్ల రక్తప్రసరణ వేగంపై ప్రభావంపడి నొప్పి తగ్గే అవకాశం ఉంటుందట. అందుకే జమైకాలాంటి దేశాల్లో అమ్మాయిలు పిరి యడ్స్ సమయంలో వేడివేడి టీ తీసుకుంటారు.
వేడినీటి కాపడం : దీని గురించి ప్రపంచంలో అందరికీ తెలిసిందే. పిరియడ్స్ సమయంలో మనలో చాలా మందిని ఎంతో కాలంగా రక్షిస్తూ వస్తున్నది ఈ చిట్కానే.. పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు అనుకునే వారు వేడి నీటి బాటిల్స్‌తో కాపడం పెట్టుకుంటే నొప్పి కాస్త తగ్గుతుంది.
నువ్వుల నూనెతో : నువ్వుల నూనెకు నొప్పిని తగ్గించే గుణం ఉంటుందట. అందుకే ప్రపంచ మంతా దీన్ని పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గించే మందుగా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె ఉపయో గించిన తర్వాత ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. అందుకే దీన్ని చాలామంది ఉపయోగిస్తుంటారు.
పాలకూర తినండి : పిరియడ్స్ సమయంలో మన శరీరంలోంచి రక్తం పోవడం వల్ల ఐరన్ స్థాయులు తగ్గు తాయి. ఇలాంటప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విటమిన్ కె, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తమకు శక్తి అంది నొప్పిని తట్టుకోగలుగు తామన్నది యూకే అమ్మాయిల భావన.
అల్లం : అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో. వీటిలో చాలా ప్రయోజనాలను పరిశోధనలు కూడా నిరూపించాయి. ఇది రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు పీఎంఎస్ లక్షణాలను కూడా కనిపించకుండా చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, నడుము నొప్పి, వాంతులు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గడంతో పాటు అతి రక్తస్రావం ఉంటే ఆ సమస్య కూడా తగ్గుతుంది.
జీలకర్రతో : ఓ పరిశోధన ప్రకారం ప్రపంచంలో ఎనభై శాతం మంది పిరియడ్స్ సమయంలో నొప్పిని అనుభవిస్తారట. మన దేశంలో అమ్మాయిలు ఈ నొప్పిని తగ్గించేందుకు జీలకర్రను ఉపయోగిస్తారు. మంచి ఫలితం కోసం స్పూన్ జీలకర్రను గ్లాస్ వేడి నీటిలో వేసి తాగండి.
చాక్లెట్ : పిరియడ్స్ సమయంలో డల్‌గా అనిపిస్తోందా.. అయితే డార్క్ చాక్లెట్ తిని చూడండి. ఇది మీ మూడ్‌ని మారుస్తుంది. ఇది పరిశోధనల్లో కూడా తేలింది. ఇందులోని మెగ్నీషియం, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పిరియడ్స్ సమయంలో మీ మూడ్‌ని బాగుచేస్తాయి.