Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగా ఏ పండ్లు తిన్నా వాటిపై తొక్కను తీసి పడేస్తాము. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చెత్త అనుకునే ఆపై తొక్కలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం...
ప్రస్తుత సమాజంలో తొందరపాటు తనంతో, సమయాన్ని వృదా చేసుకోకూడదు అనే ఆలోచనతో మన చర్మ సంరక్షణ కోసం మనం మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆధారపడతాము. సరిగ్గా గమనిస్తే మనం వాడే వాటిల్లో ఎన్నో మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులతోనే తమరు చేస్తారు. అలాంటప్పుడు డబ్బులు ఖర్చుపెట్టి ఆ రసాయనల ప్రభావం వల్ల ఇబ్బందులు పడే కన్నా మీరే ఈ ''ఫేస్ ప్యాక్స్''ని తయారు చేసుకోవచ్చు.
వేసవి కాలంలో మార్కెట్లో నారింజా, నిమ్మ పుష్కలంగా దొరుకుతాయి. అందులో సందేహమే లేదు. ఈ పండ్లపై తొక్కలలోని విటమిన్ సి చర్మ సంరక్షణలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే నేరుగా ఉపయోగించడం కన్నా ఈ తొక్కలను పొడిగా చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవడం సులభం.