Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా కొంతమంది మోచేతులు, మోకాళ్లుపై చర్మం నల్లగా, గరుకుగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను మన ఇంట్లోనే ఉన్న పదార్థాలతోనే మనం నివారించుకోవచ్చు. ఎన్నో రకాల క్రీంలు, కాస్మోటిక్స్ ఉన్నప్పటికి వీటివలన సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంది. అందువలన సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతో ఏవిధంగా చేయాలో చూద్దాం.
- తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
- సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలానే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి.
- పెరుగులో నాలుగు చుక్కల వెనిగర్ కలిపి.. మోచేతులకు రాసుకోవాలి. తరవాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. పులిసిన పెరుగు కూడా బాగా పని చేస్తుంది.
- గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకోవాలి. తరవాత వేడినీళ్లలో తడిపిన టవల్ని చుట్టుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.
- అలాగే మూడు చెంచాల సెనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే కలబంద గుజ్జు రాసుకున్నా సమస్య దూరమవుతుంది.