Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది.
స్నానం చేసే ముందు నీళ్ళలో పాలుకలిపి స్నానం చేస్తే చర్మం తళతళ మెరిసిపోతారు.
పెదవులు పగులుతున్నాయని బాధపడుతున్నారా.... అలా పెదవులు పగలకుండా ఉండాలంటే వాటికి మీగడ రాస్తే సరిపోతుంది.
మొటిమలతో ఇబ్బందిగా వుంటే ప్రతిరోజూ ఎక్కువసార్లు మోఖాన్ని కడుగుతూ పొడి టవలుతో తుడుచుకుంటే మొటిమలు తొందరగా తగ్గుతాయి.
లేతకొబ్బరి ముఖానికి పేస్ పేక్ వేసుకుంటే ముఖం చక్కగా, అందంగా కనబడుతుంది.
సీకాయతో రోజు తలస్నానం చేస్తే చుండ్రు రాకుండా ఉంటుంది.
స్నానం చేసి వచ్చిన తరువాత, కొంచం నీటిలో నిమ్మరసం కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది.
తులసి ఆకులను నమలడం వల్ల నోటి నుండి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల నాజుగ్గా తయారవుతారు.