Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీరకాయలో యాంటీ - ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలం గా ఉన్నాయి. ఇవి శరీర మొత్తం శుధ్ది చేసి, శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు బీరకాయను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా కోలుకునేలా చేస్తుంది.
- అంతటి శక్తికలిగిన బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుకు పనిచేసేలా, త్వరగా తేరుకొనేందుకు సహాయపడుతుంది. ఏ ఇన్ఫెక్షన్లూ, ఏ వైరస్లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది.
- ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
- బీరకాయలో విటమిన్ సితో పాటు ఐరన్, మెగ్నీషియం, థయామిన్ ఎక్కువగా వుంది. త్వరగా సన్నబడాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
- రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ వ్యాధులను నివారిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులకు కూడా బీరకాయ మంచి ఔషధం.
- దీనిలోని బీ6 విటమిన్ వల్ల కంటి సమస్యలు దూరమవుతుంది.
- శరీరాన్ని బీరకాయ కాంతివంతంగా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.