Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ లాక్డౌన్ కాదుగానీ అసలు నా ఫోన్ నా చేతిలోనే వుండటం లేదు. ఇరవై నాలుగ్గంటలూ పిల్లలు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు. వద్దని గట్టిగా కోప్పడితే ఏడుస్తారు. పోనీ చేతిలోంచి తీసేద్దామా అంటే అలిగి అన్నం కూడా తినరు. ఈ అలవాటు ఎలా మానిపించాలో తెలియడం లేదు' అంటూ ఈ మధ్య ఓ తల్లి తన ఆవేదనను నా దగ్గర వెళ్లబుచ్చుకుంది. మరి గాడ్జెట్స్ బారి నుండి మన పిల్లల్ని బయట పడేయాలంటే ఏలా..?
ఈ మధ్య కాలంలో పిల్లల ప్రస్తావన వస్తే పేరెంట్స్ అంతా మాట్లాడే మాటలు ఇవే. అంతెందుకు మనం ప్రయాణాల్లో గమనించినట్టయితే పేరెంట్స్ సెల్ఫోన్లో బిజీగా వుంటారు. పిల్లలు ఐ-పాడ్‌తో బిజీగా వుంటారు. వాళ్లని చూస్తుంటే అసలు వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులేనా? అన్న అనుమానం, ఆశ్చర్యం కలగక మానదు. నిజం మాట్లాడాలంటే పిల్లలు గాడ్జెట్స్‌ని వాడటాన్ని మాటల్లో ఖండిస్తున్నామే గానీ, మానసికంగా మనం కూడా కొంత వరకు వాటికి అలవాటు పడిపోయాం.
పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్థం
'గాడ్జెట్స్ ఎడిక్షన్ ఇన్ కిడ్స్' అన్న అంశం మీద వందల కొద్దీ వ్యాసాలు, ఉపన్యాసాలు కొనసాగుతూనే వున్నాయి. చెప్పిన విషయాన్నీ మళ్ళీ మళ్ళీ తిప్పి చెప్తూనే వున్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పక్కనుంచితే... కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఐ-ఫోన్, ఐ-పాడ్స్ పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. రానున్న విద్యాసంవత్సరంలో ఆన్లైన్ ద్వారానే విద్యార్థులకి విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరూ కాదనలేని, ఖండించలేని అంశం. లేకుంటే పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు గాడ్జెట్స్ అనేవి పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి.
పదునైన ఆయుధాలు
ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా పరిస్థితులని బట్టి మార్పు అనివార్యం. దాన్ని అడ్డుకోవటం కూడా అసాధ్యమే. కాబట్టి ఆ మార్పుని అంగీకరించి, దానిపై సరైన అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం. అప్పుడే సమాజంలో మన మనుగడ సాఫీగా సాగేది. ఇది సాంకేతిక యుగం. కాబట్టి పిల్లలు చిన్నతనం నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే ఈ రోజు పిల్లలు వాడుతున్న గాడ్జెట్స్ ఎంతో పదునైన ఆయుధాల వంటివి. వాటిని సరైన పద్ధతిలో వాడకపోతే అవే సమాజానికి పెద్ద గొడ్డలి పెట్టులా తయారవుతాయి. ఆ విషయంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతాయుతంగా వుండి, గాడ్జెట్స్‌ని కన్స్ట్రక్టివ్ వేలో ఎలా ఉపయోగించుకోవాలో పిల్లలకి నేర్పుకోవాలి.
ఎందుకు వ్యసనంగా మారింది
నిజానికి పిల్లలు గాడ్జెట్స్‌కి అలవాటు పడుతున్నారంటే దానికి ప్రధాన బాధ్యులు తల్లిదండ్రులనే చెప్పాలి. వాళ్ళుÊ పిల్లలతో గడపవలసిన విలువైన సమయాన్ని గాడ్జెట్స్ ఆక్రమిస్తున్నాయి. అంతేకాదు పిల్లలు ఎటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, దాని ప్రభావం ఎదుగుదల దశలో వున్న వాళ్ళ మెదడు మీద ఎంత తీవ్రంగా వుంటుంది అన్న విషయాల్లో తల్లిదండ్రుల మానిటరింగ్ లోపించటం వల్ల కూడా పిల్లలు వ్యవనానికి లోనవుతున్నారు.
ఎలాంటి చర్యలు తీసుకోవాలి
ట సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల స్క్రీన్ టైంని కట్టడి చేయటానికి టైం లిమిట్ పెడతారు. కానీ అది సరైన పద్ధతి కాదు. మీరు ఇచ్చిన టైంలోపు వాళ్ళు చూస్తున్న ప్రోగ్రామ్స్గానీ, గేమ్స్గానీ కంప్టీల్ అవకపోవచ్చు. దాంతో వాళ్ళల్లో అసంతృప్తి ఏర్పడి, అవి అసహనంగా మారుతుంది. దాని ఫలితమే అలకలు, అన్నం తినకుండా నిరాహార దీక్షలు. అందు కని వాళ్ళు చూడాలనుకుంటున్న ప్రోగ్రామ్స్ ఏంటి? వాటి నిడివి ఎంత? అనేది ముందుగా తెలుసుకోండి. అవసరాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్స్‌ని లిమిట్ చేయటం మంచిది. మీరు ఎందుకు లిమిట్ చేస్తున్నారో, దాన్లో వుండే మంచి చెడులేమిటో వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పండి. అంతేగానీ వాళ్ళని ఇన్సిస్ట్ చేయకూడదు. పిల్లలకి అసలు నచ్చని విషయమే అది. దానివల్ల వారిలో తిరుగుబాటు ధోరణి తలెత్తే అవకాశం వుంది.
ట పిల్లల కాగ్నిటివ్ డెవలప్మెంట్కి తోడ్పడే అనేక యాప్స్ అందుబాటులో వున్నాయి. వాటి ద్వారా పిల్లల్లో పెయింటింగ్స్, బుక్‌రీడింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలు పెరగటమే కాకుండా ఒకాబ్యులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తల్లిదండ్రులు అలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయటంతో పాటు పిల్లలతో కలిసి వాటిని ఎంజారు చేయగలిగితే ప్రమాదకరమైన యాప్స్ వైపు పిల్లల దృష్టి వెళ్ళకుండా కొంత వరకు అరికట్ట గలుగుతారు.
ట యాప్స్ ద్వారా పిల్లలు నేర్చుకున్న ప్రతి విషయాన్ని తిరిగి పేపర్ మీద పెట్టి మీకు వివరించమని అగడండి. వాళ్ళు చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా పిల్లల్లాగా వినాలి. అప్పుడే వాళ్ళల్లో ఉత్సాహం కలిగి ఇంకా కొత్త విషయాలు తెలుసుకుని మీకు చెప్పాలనే ఉత్సుకత ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం హ్యాండిల్ చేస్తోంది పిల్లల్ని కాబట్టి మనం వాళ్ళకి చెప్పదల్చుకున్న విషయాన్ని వాళ్ళ మాటల్ని, చేతల్ని అనుకరిస్తూ వాళ్ళ పద్ధతిలో చెప్పినట్టయితే అది ఎఫెక్టివ్‌గా రీచ్ అవుతుంది. అలాకాకుండా కేవలం మనధోరణిలో మాట్లాడితే ఒక్కోక్కసారి మనం ఏం చెప్పదల్చుకున్నామో కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు.
ట పిల్లలతో కలిసి టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మధ్యమధ్యలో ఆ కార్య క్రమానికి సంబంధించిన ప్రశ్నలు పిల్లల్ని అడుగుతుండండి. దాని వల్ల పిల్లలు తాము చూస్తున్న విష యాన్ని ఏ
యాంగిల్లో రిసీవ్ చేసుకుం టున్నారో మీకు అర్థం అవుతుంది. దానివల్ల పిల్లల ఆలోచనా విధానం ఎలా వుందో మీకు బోధపడుతుంది. ముందు మనం అర్థం చేసుకోగలిగితేనే కదా సరిదిద్దగలిగేది. ఏ విషయమైనా పిల్లలు స్వయంగా నేర్చు కోవటానికి, తల్లిదండ్రుల గైడెన్స్‌లో నేర్చుకోవ టానికి చాలా వ్యత్యాసం వుంటుంది. మీరు గమనించి నట్టయితే ఈ మొత్తం ప్రాసెస్‌లో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అది వాళ్ళ కెరీర్‌కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
ఎక్కువ సమయం తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో గడిపే పిల్లల మానసిక వికాసానికి, ఒంటరిగానే కేర్టేకర్స్తోనే గడివే పిల్లల మానసిక వికాసానికి ఎంతో వ్యత్యాసం వుందని మానసిక నిపుణులు చెప్తున్నారు.
చివరిగా...
- పిల్లలు కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్మెంట్కి ఎంతగానో తోడ్పడుతున్న గాడ్జెట్స్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన తెలిసివేటల మీదే ఆధారపడివుంది.
- 'అవి సర్వత్ర వర్జిమేల్' అన్నారు పెద్దలు. ఈ సూక్తి గాడ్జెట్స్ వాడకానికి బాగా వర్తిస్తుంది. అవసరానికి మించి వాడితే కళ్ళు, మెదడుతో పాటు మానవసంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం చాలా వుంది.
చాలామంది తల్లిదండ్రులు రోజులో ఎక్కువ భాగం చేతిలో సెల్ఫోన్స్తోనే గడపటం పిల్లలు గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అవి 'తప్పు' అని తెలీటం లేదు. అలాం టప్పుడు పిల్లల్లో మనం కోరుకుంటున్న మార్పుకి పునాదులు ఎక్కడ పడాలి అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాల్సిందే.
- అమ్మాజీ, సైకాలజిస్ట్, 7989695883