Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్ళడం ప్రమాదం. అందుకే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీ కనుబొమ్మలను మీరే చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం...
మంచి హై-కాటన్ థ్రెడ్ తెచ్చుకోండి. ఈ థ్రెడ్ మీ ముంజేయి దాటి ఇంకో మూడు ఇంచులు ఎక్కువ ఉండేట్లు చూసుకోండి. అంటే అది సుమారుగా 35 సెంటీమీటర్లు, 14 ఇంచులు ఉండాలి. సింథెటిక్ థ్రెడ్ కంటే కాటన్ థ్రెడ్‌తోనే గ్రిప్ గట్టిగా ఉంటుంది. అలాగే చిన్న ఐబ్రో కత్తెర తెచ్చుకోండి. ఎందుకంటే, థ్రెడింగ్‌కి ముందు ఐబ్రోస్‌ని ట్రిం చెయాలి. ఈ కత్తెర చిన్నగా, షార్ప్‌గా ఉండాలి. ఇంకా ఐబ్రో బ్రష్, అది శుభ్రంగా ఉండాలి.
ఐబ్రో పెన్సిల్ రెడీగా పెట్టుకోండి. మీకు కావాల్సిన షేప్ డ్రా చేసుకోవడానికి పనికొస్తుంది. మీ ఐబ్రోస్ కంటే డార్కర్ షేడ్‌లో ఉన్న పెన్సిల్ తీసుకోండి. ఈ పెన్సిల్ మార్క్ మేకప్ రిమూవర్‌తో కానీ, నీటితో కానీ పోయేలా ఉండాలి. అది కూడా చెక్ చేసుకోండి. అలాగే అలోవెరా జెల్ గానీ, ఐస్ క్యూబ్స్ కానీ దగ్గర పెట్టుకోండి. థ్రెడింగ్ అయిన తర్వాత ఇవి అప్లై చేస్తే హాయిగా ఉంటుంది. టట