Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైట్ వెనిగర్ : వైట్ వెనిగర్లో ఎసెటిక్ ఆసిడ్, నీళ్ళూ ఉంటాయి. అది జిడ్డుని తొందరగా వదలగొడుతుంది. బాక్టీరియాని కూడా తేలిగ్గా తీసేస్తుంది. మార్కెట్లో దొరికె ఖరీదైన వాటిని ఉపయోగించడం కన్నా ఇది మంచిది. లాక్డౌన్ టైంలో మార్కెట్లకి వెళ్ళి అవి తెచ్చి పెట్టుకోవడం కంటే వైట్ వెనిగర్ని వాడుకోవచ్చు.
నిమ్మకాయ : పంపులకీ, ట్యూబ్స్కీ ఎక్కడైనా తుప్పు ఉన్నా, షైనింగ్ పోయి ఉన్నా, మరకలున్నా నిమ్మకాయ బాగా పనికొస్తుంది. నిమ్మకాయతో రుద్ది కడిగితే తప్పు మరకలు తొలగిపోతాయి.
ఆవిరి : ఆవిరి ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అది బాక్టీరియాని పోగొడుతుంది. ఎలాంటి కెమికల్సూ వాడకుండానే ఇల్లంతా ఒక్కసారి డిస్ ఇంఫెక్ట్ అయిపోతుంది.
వీటితో పాటు..ఎప్పటికప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. క్లోరోక్స్ క్రిమిసంహారక ఉత్పత్తులతో ఉపరి తలాలను తుడవాలి. లైజాయిల్ క్రిమి సంహారక స్ప్రే, బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగిన లిక్విడ్స్తో ఇంటిని క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వైరస్లు చాలా వరకు దూరం అవుతాయి. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మామూలుగా ఇల్లు తుడిచే టప్పుడు ఆ నీటిలో వీటిని పోస్తుంటారు.. ఒక కప్పు నీటిలో మూడవ వంతు క్లోరిన్ బ్లీచ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి తుడవాలి. అదే విధంగా నాలుగు టేబుల్ స్పూన్స్ క్లోరిన్ బ్లీచ్ పావు వంతు నీటిలో కలపాలి. ఈ నీటితో ఇంటిని క్లీన్ చేస్తుండాలి. ఇలా చేస్తుంటే చాలా వరకూ క్రిములు దూరం అవుతాయి. ఇల్లు కూడా శుభ్రపడుతుంది. వీటితో పాటు సబ్బు నీటిలో వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. ఇకనుంచి ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు ఇలా చేయండి.. దీని వల్ల ఇల్లు మొత్తం శుభ్రం అవుతుంది.