Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరిలో స్పెషల్‌గా కనిపించాలని కలలు కంటాం. ఆ కలలను నిజం చేసుకునేందుకు కషి చేస్తాం. అందంగా, ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు మన వంతు ప్రయత్నం చేస్తుంటారు. కాలేజ్‌కి, ఆఫీసుకి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించడం పరిపాటి. ఎవరికి వారు తాము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి స్పెషల్ అపియరెన్స్ కోసం తపిస్తూ, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలు వస్తే చెప్పనవసరం లేదు. గంటల తరబడి ఆలోచిస్తారు. గతంలో పండుగలు, పబ్బాలకు మాత్రమే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడలా కాదు. ఏ చిన్న అకేషనైనా కొత్త డ్రెస్ కొనుక్కుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఏదిఏమయినా ఎప్పటికప్పడు స్పెషల్‌గా కనిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పుడో ఓరోజు తళుక్కున మెరవడం కాదు. ప్రతిరోజూ తళతళలాడాలి, తళుకులీనాలి అనుకుంటున్నారు చిన్నాపెద్దా అందరూ. అలాంటి వారు వీటిపై ఓ లుక్కేయండీ...