Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెసరపప్పు అనగానే మనకి మొలకెత్తిన పెసలూ, పెసరట్లు బాగా గుర్తొస్తాయి. అయితే పెసలు సౌందర్య సాధనంగా కూడా పనికొస్తాయి. ముఖం, చర్మం, జుట్టు ఎలాంటి సమస్యలకైనా పెసలతో చెక్ పెట్టేయొచ్చు. బ్యూటీ పార్లర్లకు వెళ్లేపని లేకుండా అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.
గుప్పెడు పెసలని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టి, పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి. ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ పేస్ట్ అప్లై చేసి పదిహేను, ఇరవై నిమిషాల పాటూ ఉంచెయ్యండి. ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే చర్మం మదువుగా తయారౌతుంది. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖం కూడా నిగారిస్తూ అందంగా మారుతుంది.
జుట్టు ఊడిపోతున్నా, డ్రై అయిపోతున్నా, డల్ గా ఉన్నా పెసలతో చేసే హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. కాసిని పెసల్ని ఉడకబెట్టి రుబ్బండి. ఇందులో గుడ్డు పచ్చసొన, కొంచెం నిమ్మరసం, పెరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచండి. షాంపూతో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలని ఈ ప్యాక్ పోగొడుతుంది.